పవన్‌కళ్యాణ్ కొంతకాలం క్రిందట ట్విట్టర్‌లో చేరారు. రాజకీయ అంశాలపై పవన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు చెప్పేవారు. ప్రభుత్వాల్ని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించేవారు కూడా. అయితే చాలా అరుదుగా మాత్రమే పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌ని వినియోగించడం చూశాం. అయితే ఇకనుంచి పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారని సమాచారమ్. తన పార్టీ జనసేన గురించీ, అలాగే తన సినిమాల గురించీ, అంతే కాకుండా టాలీవుడ్‌లో ఇతర సినిమాల గురించి కూడా పవన్‌కళ్యాణ్ స్పందిస్తారని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది. అభిమానులతో ఇంటరాక్షన్ కోసం ట్విట్టర్‌ని పవన్‌కళ్యాణ్ వేదికగా వాడుకుంటారట. ఆ ఉద్దేశ్యంతోనే ఆయన ట్విట్టర్‌లోకి ఎంటర్ అయినప్పటికీ ఇంతవరకు అభిమానులు ఆశించిన స్థాయిలో పవన్‌కళ్యాణ్ యాక్టివ్‌గా ఉండలేదు. 'ఖైదీ నెంబర్ 150'కి విషెస్ చెబుతూ ట్విట్టర్‌లో కామెంట్స్ పోస్ట్ చేసిన పవన్, ఆ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి, జల్లికట్టుపై స్పందించారు. జల్లికట్టుతోపాటుగా తన వ్యవసాయ క్షేత్రంలో తాను చేసే సేంద్రీయ వ్యవసాయం గురించి కూడా ప్రస్తావించారాయన. అంతే కాకుండా తనను ఫాలో అవుతున్నవారికి పవన్ థ్యాంక్స్ కూడా చెప్పారు. గడ్డంతో కూడిన పవన్ ఫొటో ఆయన అకౌంట్‌లో ప్రత్యక్షమైంది. ఫొటో పాతదే అయినా ఈ లుక్ డిఫరెంట్‌గా ఉందని పవన్ అభిమానులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ పవన్ ట్విట్టర్‌లో యాక్టివ్ అయితే అభిమానులకి అది 'పవర్‌ఫుల్' న్యూసే కదా.