సెక్సీ హాట్‌ ఆర్‌ఎక్స్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

గోరింటాకు రంగు షార్ట్‌ డ్రస్సులో ఈ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? అవును ఆమె 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో కుర్రకారు మనసుల్నిల సున్నితంగా లాగేసిందే ఆ పాయల్‌ రాజ్‌పుత్‌నే. మరోసారి ఇదిగో ఇలా విజృంభించేసింది. మోహందీ కలర్‌ అల్ట్రా మోడ్రన్‌ డ్రస్సులో అమ్మడి అందాల తళుకు బెళుకులు చూస్తున్నారుగా. సినిమాలోనే అంతా చూపించేసింది అనుకుంటే పొరపాటే. ఇంకా చాలా చాలా గ్లామర్‌ యాంగిల్స్‌ ఉన్నాయి అమ్మడిలో. ఒక్కొక్కటిగా బయటికి తెచ్చి చూపిస్తానంటోంది హాట్‌ భామ పాయల్‌ రాజ్‌పుత్‌. చేసింది ఒక్క సినిమానే అయినా గ్లామర్‌తో సెన్సేషన్‌ సృష్టించేసింది. అంతకు మించిన పర్‌ఫామెన్స్‌తోనూ కుర్రోళ్ల మదిలో పదిలంగా పాగా వేసేసి, కుర్రకారుకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసేసిందీ ముద్దుగుమ్మ. తొలి సినిమా అనూహ్యంగా సంచలనాత్మక విజయాన్ని అందుకోవడంతో అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నా, ఏది పడితే అది అందిపుచ్చుకోవాలనుకోవడం లేదట ఈ ముద్దుగుమ్మ. ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానని భీష్మించుకుని కూర్చుందట. చూడాలి మరి అమ్మడి గ్లామర్‌ హొయలు తిలకించబోయే ఆ తదుపరి చిత్రం ఏమై ఉంటుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS