పాయల్‌.. జిల్‌ జిల్‌ జిగేల్‌

By iQlikMovies - September 04, 2018 - 17:16 PM IST

మరిన్ని వార్తలు

మిల్కీ వైట్‌ గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన కొత్త భామ పాయల్‌ రాజ్‌పుట్‌. తొలి తెలుగు సినిమా 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ భామ, తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి సిద్ధంగా వుంది. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాలో పిచ్చ గ్లామర్‌తో కుర్రకారుకి కిర్రాక్‌ పుట్టించేసిన పాయల్‌, సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోలతో హీటెక్కించేస్తూనే వుంది. ఆ కోవలోనే తాజా ఫొటో సెషన్‌కి సంబంధించిన స్టిల్స్‌ని ఇదిగో ఇలా పోస్ట్‌ చేసింది పాయల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా. ఇంకేముంది, క్షణాల్లో ఈ ఫొటోలిప్పుడు వైరల్‌ అయిపోయాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. డార్క్‌ బ్లూ కలర్‌ టాప్‌లో, షార్ట్‌ బాటమ్‌ జీన్స్‌లో పాయల్‌ మిల్కీ గ్లామర్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అంతే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS