'ఆర్ఎక్స్ 100' సినిమాతో విచ్చల విడిగా అందాలారబోసి, కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇటీవలే 'వెంకీ మామ' సినిమాలో వెంకటేష్‌కి జోడీగా నటించింది. సినిమా సూపర్ హిట్టే. కానీ, పాయల్ పేరు ఎక్కడా వినిపించలేదు. ప్రస్తుతం 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే, తొలి సినిమా ఇచ్చిన సెన్సేషనల్ గుర్తింపుతో సోషల్ మీడియాని తనదైన శైలిలో హీటెక్కించేందుకు వీలు చిక్కినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉంది పాయల్ రాజ్‌పుత్. ఈ మధ్య సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నెట్టింటికి కాస్త దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్గా ఓ హాట్ పిక్‌తో దర్శనమిచ్చింది. అయితే, ఈ పిక్‌లో హాట్‌నెస్‌ని భూతద్దం వేసి వెతకాలంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కానీ, డీప్ ఓపెన్ బ్యాక్ వ్యూతో పాటు, హాట్ హాట్ థైస్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఇంతలా హొయలు పోతున్న ఈ ముద్దుగుమ్మని వర్ణించాలంటే కూసింత కళాపోషణ తప్పదు సుమీ. ఫేస్‌లోని సెక్సీ ఎక్స్ప్రెషన్తో ఏకంగా తన స్కిన్ గ్లామర్‌నే డామినేట్ చేసేసింది అదే అందాల పాయల్ గ్లామర్ సీక్రెట్.