అందాల బుట్టబొమ్మ

By iQlikMovies - July 11, 2018 - 14:12 PM IST

మరిన్ని వార్తలు

ఎవరీ అందాల బుట్టబొమ్మ అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి అమ్మడు సూపర్‌ హాట్‌. పేరు పాయల్‌ రాజ్‌పుత్‌. తెలిసిందా? 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సినిమాలోనే సూపర్‌ డూపర్‌ అందాల విందు కానిచ్చేసిందీ హాట్‌ భామ. ఈ సినిమాలో హీరోతో, అమ్మడికి వున్న ముద్దుల సంఖ్య ఎంతో లెక్కపెట్టడం కూడా కష్టమంట. అంటే అంతలా ముద్దుల పండగట ఈ సినిమాలో. ఈ సినిమాతోనే భామ ఎంట్రీ జరుగుతోంది. ఫస్ట్‌ సినిమా అన్న భయం, బెరుకూ ఏమాత్రం కనిపించకుండా నటించేసిందట. ఆల్రెడీ టీజర్‌లోనే అమ్మడి గ్లామర్‌ యాంగిల్‌ ఓ రేంజ్‌లో చూపించేసింది. ఎక్కడా మొహమాటపడలేదు పాపం. చూడాలి మరి సినిమా విడుదలై, ప్రేక్షకులకు ఈ హాట్‌ బ్యూటీ గ్లామర్‌ నచ్చితే ఇంకేముంది టాలీవుడ్‌లో ఆఫర్ల పండగే. అలా కాక రిజల్ట్‌ ఏమాత్రం బెడిసి కొట్టినా పాపం అమ్మడి అందాలకు విలువ లేకుండా పోతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నిండైన కాస్ట్యూమ్‌ అందంగా ఉంది. అలాగే సింపుల్‌గా చెప్పాలంటే హాట్‌గా కూడా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS