కాజల్‌ని పక్కకు నెట్టేసిన పాయల్‌: రీజన్‌ ఇదే!

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌' బ్యూటీ పాయల్‌ ఇప్పుడు 'ఆర్‌డీఎక్స్‌' బాంబ్‌ అయిపోయింది. 'ఆర్‌డీఎక్స్‌' అంటే హాట్‌ బాంబ్‌ అని మొదట్లో ప్రచారం చేసిన చిత్ర యూనిట్‌, ఇప్పుడు జాగ్రత్త పడిపోయింది. ఆమెను ఓ యాక్షన్‌ బాంబ్‌గా ఇంట్రడ్యూస్‌ చేశారు. దాంతో ఈ సినిమాతో ఏకంగా పాయల్‌కి ఈ జనరేషన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌ని అప్పుడే కట్టబెట్టేశారు. ఇంకా సినిమా విడుదల కాలేదు. కానీ, ట్రైలర్‌తోనే ఈ రేంజ్‌ రెస్పాన్స్‌ కొట్టేసింది పాయల్‌ రాజ్‌పుత్‌.

 

ఈ సినిమా ట్రైలర్‌లో పాయల్‌ పవర్‌ చూసిన మిగిలిన దర్శక, నిర్మాతలు ఆమెతో మరిన్ని హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ని సిద్ధం చేసేస్తున్నారట. ఆ క్రమంలో డైరెక్టర్‌ తేజ దృష్టిని ఆకర్షించిందీ పంజాబీ బ్యూటీ. త్వరలోనే తేజ డైరెక్షన్‌లో పాయల్‌ ప్రధాన పాత్రలో ఓ పవర్‌ ఫుల్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి ఈ సబ్జెక్ట్‌ని తేజ కాజల్‌ కోసం ప్రిపేర్‌ చేస్తున్నాడట. 'ఆర్‌డీఎక్స్‌' ట్రైలర్‌ చూశాక, తన అభిప్రాయం మార్చుకుని, స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట.

 

పాయల్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా మరింత పవర్‌ జోడించి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ఈ స్క్రిప్ట్‌పై ఫైనల్‌ డెసిషన్‌ చెప్పనున్నాడట తేజ. తేజ డైరెక్షన్‌లో వచ్చిన 'సీత'లో పాయల్‌ రాజ్‌పుత్‌ ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ కోసం సిద్ధం కానుందన్న మాట. ఇకపోతే, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రస్తుతం గోవాలో సందడి చేస్తోంది. మాస్‌ రాజా రవితేజ నటిస్తున్న 'డిస్కో రాజా' సినిమాలో పాయల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాయల్‌ మూగ, చెవిటి అమ్మాయి పాత్ర పోషిస్తోందట. అలాగే సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్‌తో 'వెంకీ మామ'లోనూ పాయల్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS