గ్లామ్‌షాట్‌: బేబీ పింక్‌ 'హాట్‌' ఆర్‌డీఎక్స్‌.!

By iQlikMovies - October 03, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'ఆర్‌ఎక్స్‌ 100'లో అందాల వడ్డనకు అపారమైన రెస్పాన్స్‌ అందుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌, ఇప్పుడు 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' అంటూ, 'ఆర్‌ఎక్స్‌'కి మించిన అందాల దాడితో విజృంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో అందాల దాడికి మించిన ఇంకో సీరియస్‌ సబ్జెక్ట్‌ ఏదో ఉందనే విషయాన్ని ట్రైలర్‌ ద్వారా లీక్‌ చేశారనుకోండి..అది వేరే సంగతి.

'ఆర్‌ఎక్స్‌ 100'తో పాప చేసిన గ్లామర్‌ దాడికి కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. ఆ ఫాలోయింగ్‌ని నిలబెట్టుకునేందుకు సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పిక్స్‌తో పెచ్చిపోతుంటుంది. తాజాగా లైట్‌ బేబీ పింక్‌ ఫ్రాక్‌లో ఓ సెక్సీ ఫోటో షూట్‌ చేయించుకుంది.

ఈ ఫోటో షూట్‌లో విరగబడి అందాలారబోత వంటి కార్యక్రమాలేం చేపట్టలేదు కానీ, ఈ ఫోటోస్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ అయితే వచ్చేస్తోంది. ఇంకెందుకాలస్యం ఈ ఆర్‌డీఎక్స్‌ అందాల వైపు మీరూ ఓ లుక్కేస్కోండి. అన్నట్లు పాయల్‌ నటించిన 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS