'ఫీల్ హ్యాపీ నౌ' అనే బుక్‌పై ఏదో ఎగ్జామ్స్ ఉన్నట్లుగా సీరియస్‌గా రీడ్ (హిందీలో పడ్నా) చేసేస్తున్న పాయల్ రాజ్‌పుత్.. నిజంగానే తాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పేందుకు సింబాలిక్‌గా ఈ పోజు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అవునండీ తొలి సినిమాకే సెన్సేషనల్ విజయం దక్కించుకుంది. అది చాలదా ఆమెకు. అయితే, మరిన్ని మంచి సినిమాల్లో నటించి మంచి నటి అనిపించుకోవాలన్నది పాయల్ కోరికట. ప్రస్తుతం ఆమె చేతిలో స్టార్ హీరోలైన వెంకీ, రవితేజల సినిమాలున్నాయి. వెంకీతో 'వెంకీమామ' సినిమాలో నటిస్తోంది.
మాస్ రాజా రవితేజతో 'డిస్కో రాజా' అంటూ మాస్ రోల్లో అలరించనుంది. వీటితో పాటు, మరో సినిమాలోనూ ఆమె నటిస్తోంది. అదే 'ఆర్డీఎక్స్ లవ్'. బోల్డ్ కంటెంట్ మూవీ. సేఫ్టీస్ (కండోమ్స్) అంటూ ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌తో తెగ హల్చల్ చేసింది పాయల్ రాజ్‌పుత్. సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఏమో కానీ, ఎంతో బోల్డ్ పాత్రలోనైనా నటించే గట్స్ పాయల్‌కి ఉన్నాయని 'ఆర్డీఎక్స్' సినిమాతో మరోసారి నిరూపించింది. ఇక ఎప్పటికప్పుడే నెట్టింట్లో హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేసే పాయల్ ఇదిగో తాజాగా లైట్ బేబీ పింక్ నైట్ వేర్లో బెడ్‌పై కూర్చొని హాట్ హాట్‌గా స్కిన్ షో చేస్తోన్న పిక్ పోస్ట్ చేసింది.