ఆర్.ఎక్స్ 100తో ఓ బ్లాస్టులా పేలింది... పాయల్ రాజ్ పుత్. బోల్డ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం మొహమాట పడకపోవంతో ఆ తరహా పాత్రలు పాయల్ ని వెదుక్కుంటూ వచ్చాయి. ఐటెమ్ పాటల అవకాశాలూ దక్కాయి. మొత్తానికి ఉన్న కొన్ని రోజులూ... హోరెత్తించేసింది. అయితే ఇప్పుడు పాయల్ హవా బాగా తగ్గిపోయింది. తనకు అవకాశాలు మృగ్యమయ్యాయి. అందుకే పెళ్లి చేసుకుని సైడ్ అయిపోవాలని భావిస్తోందట. కొంతకాలంగా సౌరభ్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది పాయల్.
ఆమధ్య హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ కొంది పాయల్. ఆ ఫ్లాట్ లో కొంతకాలం ఇద్దరూ సహజీవినం కూడా చేశారని టాక్. అటు పాయల్ కుటుంబ సభ్యులకూ, ఇటు సౌరభ్ ఇంట్లో వాళ్లకూ ఈ ప్రేమ వ్యవహారం తెలుసు. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని టాక్. కరోనా ఉధృతి తగ్గాక, కాస్త వైభవంగా ఈ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నార్ట. పెళ్లయ్యాక... పాయల్ సినిమాలకు చెక్ పెట్టేస్తుందా, లేదంటే.. అడపా దడపా నటిస్తుందా? అన్నది చూడాలి.