కామ్‌గా కానిచ్చేస్తోన్న పాయల్‌.!

మరిన్ని వార్తలు

‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ గతేడాది చివరిలో ‘వెంకీ మామ’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాయల్‌ మరే సినిమాలోనూ నటించడం లేదనుకున్నారంతా. కానీ, సైలెంట్‌గా ఓ సినిమాని ఫినిష్‌ చేసేసింది పాయల్‌ రాజ్‌పుత్‌. అదే ‘5 డబ్ల్యూస్‌’. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ అధికారిగా పాయల్‌ నటిస్తోంది. ఓ పోలీస్‌ అధికారి జీవితంలో జరిగిన కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్‌ బేస్‌ చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

 

ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టైటిల్‌ రిలీజ్‌ అయ్యేవరకూ ఈ ముచ్చట బయటికి రానే లేదు. అయితే, అవుట్‌ పుట్‌ బాగా వచ్చాకే ఓపెన్‌ అప్‌ అవ్వాలనుకున్నారట చిత్రయూనిట్‌. అందుకే షూటింగ్‌ చివరి దశకొచ్చాక, టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. పాయల్‌ నటించిన రెండో సినిమా ‘ఆర్‌ డీ ఎక్స్‌ లవ్‌’లోనూ ఆమెది ప్రాధాన్యత ఉన్న పాత్రే. యాక్షన్‌ సీన్స్‌, డైలాగ్స్‌ చితక్కొట్టేసింది. అలాగే, తాజా మూవీలోనూ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ అదరగొట్టేసిందట పాయల్‌. డూప్స్‌ లేకుండా ఓన్‌గానే యాక్షన్‌ సీన్స్‌లో నటించిందట.

payal rajput 5ws

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటోంది పాయల్‌. పోలీసాఫీసర్‌గా బాడీ లాంగ్వేజ్‌ బిల్డ్అప్ చేసుకోవడంపై పెద్ద గ్రౌండ్‌ వర్కే చేసిందట. ఈ పాత్రకు తనకు లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతి ఇన్సిప్రేషన్‌ అంటోంది హాట్‌ హాట్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. అయితే, తన బోల్డ్‌ ఇమేజ్‌ని ఈ సినిమాలోనూ పాయల్‌ టచ్‌ చేసందా.? లేక ఓన్లీ యాక్షన్‌తోనే సరిపెట్టిందా.? అనేది చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS