హీరోల్ని విలన్స్‌గా మార్చేస్తున్న హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

మరో యంగ్‌ హీరో విలన్‌గా మారాలనుకుంటున్నాడు. 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ, ఇటీవల 'గ్యాంగ్‌ లీడర్‌' సినిమాతో విలన్‌ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. హీరోగా తొలి సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసిన ఈ కుర్ర హీరో తనలోని విలక్షణ నటనను బయటికి తీసేందుకు విలన్‌ గెటప్‌ వేశాడు. తనవంతు న్యాయం చేసి, విలన్‌గానూ ప్రేక్షకుల మెప్పు బాగానే పొందాడు.

 

ఇక ఇప్పుడు మరో యంగ్‌ హీరో విలన్‌గా మారతానంటున్నాడు. ఆయన ఎవరో కాదు, తేజస్‌ కంచెర్ల. ఎవరీయన అంటారా.? పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్న 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' హీరో. ఇంకా తొలి సినిమా రిలీజ్‌ కాకుండానే, బాబు టాలెంట్‌ చూడకుండానే అప్పుడే ప్రయోగాలకు సిద్ధమంటున్నాడేంటా..? అనుకుంటున్నారా.? ఏమో ఎవరి ఫేట్‌ ఎప్పుడు.? ఎలా.? టర్న్‌ అవుతుందో ఎవ్వరం చెప్పలేం. అలా మన తేజస్‌ కూడా హీరోగా తెరంగేట్రం చేసినా, ఆడియన్స్‌ ఆయనను ఎలా స్వీకరించేందుకు ఇష్టపడుతున్నారో తెలియాలంటే తన టాలెంట్‌ అంతా బయటకి తీయాల్సిందే కదా అంటున్నాడు.

 

ఆ క్రమంలోనే అవకాశమొస్తే, విలన్‌గా కనిపించడానికైనా సిద్ధమే అని సంకేతాలిస్తున్నాడు. ఈ నెల 11న 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, 'ఆర్‌ఎక్స్‌ 100'లోనూ, 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌'లోనూ హీరోయిన్‌గా నటించింది మాత్రం పాయల్‌ రాజ్‌పుత్‌నే. అంటే, ఈ భామ తనతో పాటు పరిచయం చేసిన హీరోల్ని విలన్స్‌గా మార్చేస్తుందేమో.. అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ప్రస్తుతం పాయల్‌ 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌'తో పాటు, 'వెంకీ మామ', 'డిస్కో రాజా' సినిమాల్లో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS