బిగ్‌బాస్‌3: పునర్నవిని ఎందుకు ఎలిమినేట్‌ చేశారు?

మరిన్ని వార్తలు

అసలు బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి సంబంధించి ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో ఎంతమంది ఓట్లు వేస్తున్నారు.? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి? ఈ లెక్కలేమీ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌కి తెలియడంలేదు. గత సీజన్లలో మాత్రం, ఫలానా కంటెస్టెంట్‌కి ఫలానా ఓట్లు వచ్చాయని హోస్ట్‌ చెప్పడం చూశాం. ఇప్పుడు మాత్రం, ఆ లెక్కలు చెప్పకుండానే ఎలిమినేట్‌ చేసి పారేస్తున్నారు. తాజాగా పునర్నవి ఎలిమినేట్‌ అవడంతో బిగ్‌బాస్‌ పూర్తిస్థాయిలో గ్లామర్‌ కోల్పోయిందనే చెప్పొచ్చు.

 

పునర్నవి చాలా గొప్పగా గేమ్‌ ఆడేస్తోందని అనలేం. కానీ, ఆమె కంటే చెత్తగా ఆడుతున్న కంటెస్టెంట్స్‌ హౌస్‌లో వుండి, ఆమె ఎలిమినేట్‌ అవడమే ఆశ్చర్యకరం. మొదటి నుంచీ బిగ్‌బాస్‌లో ఇలాగే జరుగుతోంది. పునర్నవి భూపాలం ఎవిక్షన్‌తో, బిగ్‌బాస్‌లో మొత్తంగా గ్లామర్‌ జీరో అయిపోయిందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఎలిమినేట్‌ అయిపోయినప్పుడు పునర్నవి చాలా బాధపడింది. కానీ, పునర్నవి ఎలిమినేట్‌ అయ్యే క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ని ఏడిపించేందుకు ప్రయత్నించారు.

 

గేమ్‌లో ఇవన్నీ భాగమే కావొచ్చుగానీ.. ఈ కారణంగా బిగ్‌బాస్‌ షోలో 'రియాల్టీ' మిస్‌ అవుతోందని బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఈ వారం తక్కువ ఓట్లు మహేష్‌ విట్టాకి వచ్చాయనీ, పునర్నవిని గేమ్‌ ప్లాన్‌లో భాగంగానే బయటకు పంపేశారనీ ప్రచారం జరుగుతోంది. అలీ రెజా రీ-ఎంట్రీకి సరైన కారణం చూపించలేదు. పునర్నవిని ఎందుకు ఎలిమినేట్‌ చేశారో తెలియదు. ఇంకా చిత్రాలు చాలా చూడబోతున్నాం. మిగిలింది కొద్ది రోజులు మాత్రమే కదా!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS