'ఆర్‌ఎక్స్‌ 100' రీమేక్‌పై పాయల్‌ బోల్డ్‌ కామెంట్‌.!

మరిన్ని వార్తలు

తెలుగులో కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా తెరకెక్కిన బోల్డ్‌ కంటెన్ట్‌ మూవీ 'ఆర్‌ఎక్స్‌ 100' ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన సంగతే. అందుకే బాలీవుడ్‌ కన్ను ఈ సినిమాపై పడింది. మిలీన్‌ లుథ్రియా ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అహాన్‌శెట్టి, తారా సుతారియా జంటగా తెరకెక్కుతోంది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి కీ రోల్‌ హీరోయిన్‌ 'ఇందు' పాత్ర. కొత్తమ్మాయి అయినా పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ పాత్రకు ప్రాణం పోసేసింది.

యదార్ధ సంఘటన నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా పాయల్‌ బోల్డ్‌ పర్‌ఫామెన్స్‌కి యూత్‌ ఫిదా అయిపోయారు. ఇప్పుడిలాంటి పాత్రలో తారా సుతారియా నటిస్తోంది. ఈ సందర్భంగా పాయల్‌ తన అభిప్రాయాలను ఆశక్తికరంగా వెల్లడించింది. ఇందు పాత్రలో తనకంటే గొప్పగా ఇంకెవరూ నటించలేరని చెప్పుకొచ్చింది. తారా సుతారియా నటనను తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదనీ, ఏరికోరి ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నారంటే, ఆమెలో ఖచ్చితంగా ఏదో టాలెంట్‌ ఉండే ఉంటుందని పాయల్‌ చెప్పింది.

సాజిద్‌ నదియాద్‌ వాలా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన మనసులో మెదిలిన ఆలోచనే ఈ 'ఆర్‌ఎక్స్‌ 100' రీమేక్‌. తాను నటించిన తొలి సినిమా ఏకంగా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతుందంటే ఎంతో సంతోషంగా ఉందని పాయల్‌ చెబుతోంది. జూన్‌ నుండి ఈ సినిమా స్టార్ట్‌ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS