దెయ్యాలతో పోటీ పడుతున్న గురు శిష్యులు.!

మరిన్ని వార్తలు

డాన్సుల్లో మకుటం లేని రారాజులు వీరిద్దరూ.. గురు శిష్యులు. ఇద్దరూ కొరియోగ్రఫీ నుండి డైరెక్టర్లుగా ప్రమోషన్‌ పొందిన వారే. వాళ్లే ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా. ఆయన శిష్యుడు లారెన్స్‌ రాఘవ. కొద్దిరోజుల గ్యాప్‌లో ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభుదేవా నటిస్తున్న 'అభినేత్రి 2' చిత్రం ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకుడు కాదు, కానీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌ (దెయ్యం పాత్ర)గా నటిస్తోంది.

మరోవైపు కొరియోగ్రఫర్‌గా సత్తా చాటి, డైరెక్టర్‌గా హారర్‌ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టి, డైరెక్షన్‌లో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌ రాఘవ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాంచన 4'. ఈ సినిమాలో వేదిక హీరోయిన్‌గా నటిస్తోంది. 'కాంచన' సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన మూడు చిత్రాలూ ('ముని', 'కాంచన', 'గంగ') మంచి విజయం అందుకున్నాయి. నాలుగో సిరీస్‌గా వస్తున్న ఈ సినిమాపైనా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

హారర్‌ మూవీస్‌ అంటే కేవలం ఒళ్లు గగుర్పొడిచే ఆర్‌ఆర్‌తో ఉగ్గబట్టుకుని చూసే ఉత్కంఠతో భయం భయం ప్రతీక్షణం.. అనే ఫార్ములా నుండి దెయ్యాల సినిమా అంటే భయం ఒక్కటే కాదు, కడుపుబ్బా నవ్వించే హాస్యం కూడా అని నిరూపించాడు లారెన్స్‌ రాఘవ. ఈ ఫార్ములాతో తర్వాత చాలా చాలా సినిమాలొచ్చాయి. కొన్ని విజయవంతమయ్యాయి కూడా. అయితే హారర్‌ కామెడీయందు లారెన్స్‌ హారర్‌ కామెడీ వేరయా.. అనాల్సిందే.

చూడాలి మరి ఈ గురు శిష్యులిద్దరి బాక్సాఫీస్‌ పోటీ ఎలా ఉండబోతోందో. అన్నట్లు వీటితో పాటు ఈ గ్యాప్‌లో 'ప్రేమకథాచిత్రమ్‌ 2' వంటి మరికొన్ని దెయ్యాల సినిమాలు కూడా రానున్నాయండోయ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS