ఈమధ్య పాయల్ రాజ్‌పుత్ పేరు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించింది. స్పెషల్ సాంగ్స్‌తో బిజీ అయిపోయిందని, పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయని... ఆమెపై వార్తలు హల్ చల్ చేశాయి. భారతీయుడు 2లో పాయల్ స్పెషల్ సాంగ్ చేస్తోందని, పుష్షలోనూ ఐటెమ్ సాంగ్ చేయబోతోందని గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాలతో పాయల్ దశ తిరిగినట్టే అనుకున్నారు. అయితే.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పాయల్ తేల్చేసింది.
ప్రత్యేక గీతాలు చేయమని తనని ఎవరూ సంప్రదించలేదని, అసలు అలాంటి పాటలు చేయాలన్న ఆలోచనే తనకు లేదని చెప్పుకొచ్చింది. ''నన్నెవరూ ప్రత్యేక గీతాల కోసం సంప్రదించలేదు. నాకు అలాంటి పాటల్లో కనిపించాలన్న ఉత్సాహం కూడా లేదు. కెరీర్ విషయంలో పరుగులు పెట్టదలచుకోలేదు. మంచి అవకాశాలనే ఎంచుకుంటాను'' అని క్లారిటీ ఇచ్చింది పాయల్. ప్రస్తుతం ఏంజెల్, నరేంద్ర చిత్రాలలో నటిస్తోంది. ఒకట్రెండు తమిళ సినిమా ఆఫర్లూ అందాయట. అయితే వాటి గురించి ఇప్పుడే పెదవి విప్పడం లేదు.