పెదకాపు-1 మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: పెదకాపు-1

నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ
దర్శకత్వం:  శ్రీకాంత్ అడ్డాల


నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
 
సంగీతం: మిక్కీ జె మేయర్
ఛాయాగ్రహణం: చోటా కె నాయుడు
కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్


బ్యానర్స్: ద్వారకా క్రియేషన్స్
విడుదల తేదీ: 29 సెప్టెంబర్ 2023

 

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.25/5

 

నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల రూటు మార్చారు. వైలెన్స్ వైపు మొగ్గు చూపారు. విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తీసిన పెదకాపు ప్రచార చిత్రాలు చూస్తే ఇందులో ఎంత వైలెన్స్ ఎంత వుంటుందో అర్ధమైయింది. మరి ఇంత వైలెన్స్ ని డిమాండ్ చేసిన ఆ కథ ఏమిటి ? ఒక సామాన్యుడిగా పెదకాపు పోరాటం ప్రేక్షకులని ఆలరించిందా ? 


కథ: 1982 నాటి కథ ఇది . అప్పుడే తెలుగు దేశం పార్టీ పుట్టింది. గోదావ‌రి లంక జిల్లాల్లో స‌త్య రంగ‌య్య (రావు ర‌మేష్‌), బ‌య‌న్న (న‌రేన్) అనే రెండు వ‌ర్గాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో వారిద్దరిదే పై చేయి.  వుంటే సత్యరంగయ్య, లేదా బయన్న. మరొకరికి రాజకీయ అవకాశం లేదు. సత్య రంగ‌య్య కోసం పెద‌కాపు (విరాట్ క‌ర్ణ) త‌న అన్నతో క‌లిసి ప‌నిచేస్తుంటాడు. త‌న‌ని అవ‌మానించాడ‌న్న కోపంతో బ‌య్యన్న కొడుకుని దారుణంగా చంపేస్తాడు స‌త్య రంగ‌య్య. అయితే ఆ నేరాన్ని త‌న మీద వేసుకొని జైలు పాల‌వుతాడు పెదకాపు అన్నయ్య. అయితే జైలుకెళ్లాక పెదకాపు అన్నయ్య క‌నిపించ‌కుండాపోతాడు. అసలు తను ఏమయ్యాడు ? అదే ఊర్లో ఉన్న అక్కమ్మ (అన‌సూయ‌) తాయి ( ప్రగతి శ్రీవాస్తవ్) మాస్టర్ ( తనికెళ్ళ భరణి) కన్నబాబు ( శ్రీకాంత్  అడ్డాల) ఇందులో ఎలాంటి పాత్రలు పోషించారు? పెదకాపు పోరాటం ఎలా సాగింది ? అనేది తక్కిన కథ.  


విశ్లేషణ: ఒకొక్క ఎపిసోడ్ కి కొత్త  పాత్ర తెరపైకి వచ్చి ఆ పాత్ర కథ చెప్పుకుంటూ వెళ్ళడం వెబ్ సిరిస్ స్టయిల్. సినిమాని ఎందుకు వెబ్ సిరిస్ లా తీయకూడదనే ధోరణితో ఈ కథ, ఇందులోని పాత్రలు రాసుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.అందుకే ఇందులోని సన్నివేశాలు చూస్తున్నపుడు ఒక సినిమాని చూస్తున్న అనుభూతిని కలిగించవు. తెరనిండా పాత్రలు వున్న ఏ పాత్రకి ఒక ప్రయాణం ప్రయోజనం వుండదు. అన్ని మధ్యలోనే ఆగిపోతుంటాయి.  


మన వూరి మహాభారతం టైపులో ఊర్లోని రాజ‌కీయాలు..ఆధిప‌త్యం, సూత్రధారులు.. ఇలా తనకి నచ్చినట్లుగా పాత్రలు రాసుకుంటూ వెళ్ళిన అడ్డాల దీనికి ఒక సినిమా రూపం ఇవ్వలేకపోయారు.  చాలా పాత్రలు వాటి వెనుక కథలు వుండటంతో అసలు  ఈ కథని ఏ లైన్ పట్టుకొని ఫాలో అవ్వాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. కథా గమనం చూసుకుంటే ఇంటర్వెల్ కి ముందే కాస్త బెటర్ గా వుంటుంది. రావు రమేష్ పాత్ర ముగించేసిన తర్వాత ఇందులో వున్న ఆ కాస్త ఆసక్తికూడా పోతుంది. దీనికి పార్ట్ 2 కూడా వుందని అన్నారు. ఆ భాగం ఎవరి కోసం ఎందుకు చూడాలి ? అనే ప్రశ్నించుకుంటే ఇప్పటికైతే సమాధానం లేదు.  


నటీనటులు: విరాట్ క‌ర్ణకి ఇదే తొలి సినిమా. యాక్షన్ సీన్స్‌లో త‌న ప్రజెన్స్ బాగుంది. డైలాగులు చెప్పినపుడు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని మాటలు రోల్ అవుతున్నాయి. క‌థానాయిక‌ ప్రగ‌తి చూడ్డానికి చాలా స‌హ‌జంగా క‌నిపించింది. ఆ పాత్రని వెరైటీగా తీర్చిదిద్దే ప్రయ‌త్నంలో అయోమయం చేసహ్రు.  రావు ర‌మేష్‌ పాత్ర సినిమాకి హైలెట్. న‌రేన్ న‌ట‌న సైతం ఆక‌ట్టుకొంది. శ్రీ‌కాంత్ అడ్డాల క్యారెక్టర్ నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది. తనికెళ్ళభరణి, నాగబాబు, ఈశ్వరి రావు, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ వడ్లమాని పాత్రలు కూడా బావున్నాయి. మిగతా నటులు పరిధిమేర చేశారు. 


టెక్నికల్: సాంకేతికంగా సినిమా బావుంది. చోటా కె నాయుడు కెమరాపనితనం ఆకట్టుకుంటుంది. అలాగే మిక్కీ జే మేయర్ నేపధ్య సంగీతం కూడా బావుంది. పాటలు మాత్రం రిజిస్టర్ కాలేదు. డైలాగుల్లో పదును లేదు. నిర్మాణ విలువలు బావున్నాయి. 


ప్లస్‌ పాయింట్స్‌:

కథా నేపధ్యం, 
నిర్మాణ విలువలు  


మైనస్‌ పాయింట్స్‌:

సాగదీత
అవసరానికి మించిన పాత్రలు 
శృతి మించిన హింస 


ఫైనల్ వర్దిక్ట్ : కంటెంట్ తక్కువ... క్యారెక్టర్లు ఎక్కువ..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS