వినోద్ కిషన్ అంటే పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు, కానీ నా పేరు శివ, అంధగారం సినిమాలు చెప్తే ఈ హీరోని గుర్తు పడతారు. తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన వినోద్ ఇప్పుడు హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అదే 'పేకమేడలు' మూవీ. అనూష కృష్ణ హీరోయిన్ గా, నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో తెరెకెక్కుతోంది పేక మేడలు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది.
కామెడీ జోనర్ లో తెరెకెక్కిన ఈమూవీలో ఎమోషనల్ పార్ట్ కూడా ఎక్కువే ఉందని టాక్. జులై 19 న రిలీజ్ అవుతున్న ఈ మూవీ కోసం మేకర్స్ వినూత్నంగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పేకమేడలు ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ప్రీమియర్ షోస్ ను వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోకి 150 రూపాయల టికెట్ ను కేవలం రూ.50 కే అందిచనున్నారు. అంటే కేవలం 50 రూపాయలతో, మల్టీప్లెక్సుల్లో సినిమా చూడోచ్చు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేకర్స్ ప్లాన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మూవీకి మొదట టాక్ రావటం ముఖ్యం. ప్రీమియర్ షో తో రావాల్సిన మౌత్ టాక్ వచ్చేస్తే సినిమా జనాల్లోకి వెళ్తుందన్నది మేకర్స్ అభిప్రాయం. కొత్త హీరో, అది కోలీవుడ్ హీరో. పెద్దగా పరిచయం లేని హీరో అలాంటి సినిమాకి జనాలు రావాలంటే ఎదో ఒకటి డిఫరెంట్ గా ప్లాన్ చేయాలి కదా అలా ఆలోచించే ఇలా ప్లాన్ చేశారట మేకర్స్ . ఏముంది 50 రూపాయలకి సినిమా చూడటం అంటే, అది మల్టీపెక్స్ లో యూత్ ఎగబడతారు కదా. పోనీలే ఒకసారి చూద్దామని, థియేటర్లకు వెళ్తారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే హిట్ గ్యారంటీ.