ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'అరవింద సమేత..' నుండి ఒక్కో పాట విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన తొలి సాంగ్ బాగుందని గుడ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇక ఈ రోజు అనగా బుధవారం రెండో సాంగ్‌ని విడుదల చేస్తున్నారు. ఈ పాట విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తోంది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌కి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ ఇచ్చారు.
అయితే అప్పుడెప్పుడో కమల్‌హాసన్ డ్యూయల్ రోల్ పోషించిన 'ఇంద్రుడు చంద్రుడు' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలోని 'లాలిజో లాలిజో.. ఊరుకో పాపాయి..' అనే పాట ఉంది. ఆ పాట ఎవ్వర్ గ్రీన్. సినిమా కథని చిన్న పిల్లల కథగా మార్చి తండ్రి పాడే పాట అది. ఆ తరహాలోనే ఇప్పుడీ పాట ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. సినిమాకి ఈ పాట అత్యంత కీలకమట. అంతేకాదు, ఆల్రెడీ ఈ పాటను పలువురు సినీ ప్రముఖులు విన్నారట. చాలా చాలా బాగుంటుంది అంటూ ప్రివ్యూస్ ఇచ్చేస్తున్నారు.
'పెనిమిటీ.. పెనిమిటీ' అంటూ సాగే ఈ పాట సిట్యువేషనల్‌గా సాగుతుందని అంటున్నారు. సినిమా చూస్తున్నంత సేపూ ఈ పాట తాలూకు ఫ్లేవర్ ప్రేక్షకున్ని వెంటాడేస్తూ ఉంటుందట. అలా ఈ పాట గురించి కాస్త ఎక్కువే చెబుతున్నారు. చూడాలి మరి రిలీజైతే కానీ తెలీదు ప్రేక్షకుని యాంగిల్ నుండి ఎలా ఉంటుందనీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ నెల 20న మరో రెండు పాటల్ని రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది 'అరవింద సమేత'.!