తెలుగు పింక్‌లో 5 పాట‌లా??

By Gowthami - January 19, 2020 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన `పింక్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్టుపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మాత‌లు. సోమ‌వారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్‌లోకి అడుగుపెట్ట‌నున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజ్‌, ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌లో మార్పులు జ‌రిగాయి. `పింక్‌`లో ఒకే ఒక్క పాట ఉంది. అది కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో వ‌స్తుంది.

 

అయితే తెలుగు రీమేక్‌లో మాత్రం 5 పాట‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. అంతేకాదు... ప‌వ‌న్‌ని యంగ్ లుక్‌లోనే చూపించ‌బోతున్నార‌ట‌. ప‌వ‌న్ ప‌క్క‌న ఓ హీరోయిన్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. సో.. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాగానే పింక్‌ని చూడాల‌న్న‌మాట‌. ఈ మార్పులు, చేర్పులూ అస‌లు స్క్రిప్టుని, అందులోని ఆత్మ‌ని చెడ‌గొట్ట‌కుండా ఉంటే చాలు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS