రాజాధిరాజ 'రామ్‌' మార్తాండ: కొత్త లుక్‌ చూశారా?

By Inkmantra - January 18, 2020 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

ఎనర్జిటిక్‌ రామ్‌ ఏంటీ ఇలా అయిపోయాడేంటీ.? అనుకుంటున్నారా.? ఇది ఏ సినిమా లుక్‌ అని ఆశ్చర్యపోతున్నారా.? అయితే అర్జెంటుగా మీకు మ్యాటర్‌ రివీల్‌ చేయాల్సిందే. ఇదే సినిమాలోని లుక్‌ కాదండీ బాబూ. ది రాయల్స్‌ 2020 మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ కోసం రామ్‌ ఈ అవతారమెత్తాడు. భలే బాగున్నాడు కదా. రాయల్‌ దుస్తులు.. సీరియస్‌ లుక్‌.. చేతిలో కరవాలం.. అసలు సిసలు రాయల్‌ కింగ్‌లా మారిపోయాడు రామ్‌ పోతినేని.

 

అయితే, ఆ హెయిర్‌ స్టైల్‌ని కవర్‌ చేస్తూ, తలపై ఓ తలపాగా కానీ, కిరీటం కానీ ధరించాల్సింది లుక్‌ ఇంకా అదిరిపోయేది. అయితే, అదే హెయిర్‌ స్టైల్‌లో ప్రస్తుతం రామ్‌ నటిస్తున్న తాజా సినిమాలో కనిపించబోతున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ 'రెడ్‌' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సినిమాలోంచి ఓ ప్రామిసింగ్‌ ఫస్ట్‌లుక్‌ కూడా రిలీజ్‌ చేశారు. సినిమా సంగతి కాసేపు పక్కనుంచితే, ఈ కొత్త లుక్‌లో రామ్‌ భలే కొత్తగున్నాడులే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS