మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్ హిట్... పోకిరి. పూరి జగన్నాథ్ స్టామినా పూర్తి స్థాయిలో బయటపెట్టిన సినిమా ఇది. అప్పటి ఇండస్ట్రీ రికార్డులన్నీ `పోకిరి` తిరగరాసింది.
టీవీలో కొన్ని వందల సార్లు ప్రసారమైంది. అయినా ఇప్పుడు ఈ సినిమాని మళ్లీ రీ - రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మారిన సాంకేతికత ఆధారంగా.. సినిమా ప్రింట్ క్వాలిటీనీ, సౌండ్ క్వాలిటీని పెంచి - ఇప్పుడు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా థియేటర్లలో.. పోకిరిని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఓవర్సీస్‌లోనూ కొన్ని షోలు పడబోతున్నాయి. ఇది వరకు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ఖుషి, తొలి ప్రేమ, గబ్బర్ సింగ్ సినిమాల్ని వరుసగా ప్రదర్శించారు. ఆ షోకి విపరీతమైన స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు పోకిరిని కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో సినిమా, ఇన్నేళ్ల తరవాత.. ఈ స్థాయిలో రీ - రిలీజ్ చేయడం కూడా రికార్డే. మహేష్ ఫ్యాన్స్‌కి ఇంత కంటే కావల్సిందేముంటుంది?