టాలీవుడ్ ఇంటస్ట్రీ లో 'దిల్' సినిమాతో నిర్మాత గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన దిల్ రాజు పై, మాదాపూర్ పీఎస్ లో పోలీస్ కేసు నమోదైంది. తను రాసిన నవల లోని కథ ని కాపీ కొట్టి, 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా తీశారంటూ రచయిత్రి శ్యామలారాణి, దిల్ రాజు పై కేసు నమోదు చేసింది.
ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు 'మిస్టర్ పర్ ఫెక్ట్' సినిమా తీశారు. అయితే ఈ సినిమా తన అనుమతి తీసుకోకుండా నేను రాసిన 'నా మనసు కోరింది నిన్నే' నవల ఆధారంగా ఈ సినిమా తీశారని పోలీసులని ఆశ్రయించింది. ఇటీవల ఈ సినిమా టీవీ లో చూసిన శ్యామల నిర్మాత పై ఆరోపణలు చేయకుండా, ఎవరో తన కథను వాళ్ల కథ గా దిల్ రాజు కు చెప్పారని తెలిపింది.
అంతేకాకుండా ఈ సినిమాలో దాదాపు 28 సీన్లు, తన నవల ఆధారంగా చేసుకుని తీసారని ఆరోపించారు. భవిష్యత్ లో ఈ సినిమా వేరే భాషలో రీమేక్ చేస్తే, తన పేరును టైటిల్స్ లో వేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సినిమా రిలీజైన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆమె కేసు వేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.