'కట్ అవుట్ చూసి కొన్ని కొన్నినమ్మేయాలి డూడ్' అన్న ప్రభాస్ డైలాగ్ పర్ఫెక్ట్ గా తనకే నప్పుతుంది. సినిమా హిట్ అయినా ప్లాఫ్ అయినా ప్రభాస్ ఉంటే వసూళ్లు గ్యారంటీ. దీనితో నిర్మాతల హీరో అయిపోయాడు ప్రభాస్. తనని నమ్మి 100 పెడితే 200 వస్తుంది అని ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీలో. డార్లింగ్ నటించిన సినిమాలన్నీ 100 కోట్లు మార్కెట్ దాటటం గమనార్హం. బాహుబలితో మొదలైన రికార్డ్ లు కల్కి వరకు కొనసాగాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్ అనుకున్నంతగా ఆకట్టుకోకపోయినా కలక్షన్ల పరంగా పరవాలేదనిపించాయి. సలార్, కల్కిలతో బ్లాక్ బ్లస్టర్ హిట్స్ అందుకున్నాడు. కల్కి కొత్త రికార్డ్స్ తో ప్రశాంత్ నీల్ మీద ప్రెజర్ పడుతోందని టాక్.
ప్రభాస్ తో సలార్ తీసిన ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ముందు ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ పట్టాలెక్కించి తరవాత సలార్ 2 తీయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు సలార్ పార్ట్ 2 ను ముందు పట్టాలెక్కించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ని ప్రెజర్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదట సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టామని, ఇంకో ఏడాది లో సినిమా పూర్తవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే ప్రశాంత్ డ్రాప్ అయ్యాడు. డ్రాగన్ తరవాతే ప్రభాస్ మూవీ అని ప్రకటించేశాడు.
ఇంకో వైపు మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ నుంచి కూడా ఒత్తిడి వస్తొందని నీల్ సన్నిహితులు చెప్తున్నారు. సలార్ లో కొన్ని సీన్స్ అర్జెంట్ గా కంప్లీట్ చేయాల్సినవి ఉండటంతో ప్రశాంత్ కూడా ఆలోచనలో పడ్డాడట. ప్రభాస్, పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్రల్లో నటించిన బాయ్స్ ఏజ్ ని దృష్టిలోపెట్టుకుని ఓ షెడ్యూలు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కూడా తన కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో సలార్ 2 సంగతి ఏంచేస్తారో చూడాలి.