బుట్టబొమ్మకు ఆ బాధ్యత పెరిగిందమ్మా!

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్దే, చాలా తక్కువ టైమ్‌లోనే చరణ్‌తో (జిగేల్‌ రాణి స్పెషల్‌ సాంగ్‌) సహా ఎన్టీఆర్‌, మహేష్‌, అల్లు అర్జున్‌, ప్రబాస్‌.. ఇలా స్టార్‌ హీరోయిన్స్‌తో జత కట్టేసింది. ప్రబాస్‌తో పూజా నటిస్తోన్న 'జాన్‌' ప్రస్తుత ం షూటింగ్‌ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం పూజాకి తిరుగే లేదు. ఆమె ఏ సినిమాలో నటించినా అది సూపర్‌ హిట్‌ అని తేలిపోయింది. ఎన్టీఆర్‌, మహేష్‌, అల్లు అర్జున్‌ల విషయంలో అది ప్రూవ్‌ అయిపోయింది. లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌కి 'అల..'తో తిరుగులేని సక్సెస్‌ అందించింది మన బుట్టబొమ్మ. ఇక త్వరలో ప్రబాస్‌ విషయంలోనూ అది ప్రూవ్‌ కానుంది.

 

ఈ వివరాలు కాసేపు పక్కన పెడితే, అసలు సిసలు అగ్ని పరీక్ష ఒకటుంది పూజా హెగ్దేకి. అదే అఖిల్‌ సినిమా. ఏరి కోరి కోటి ఆశలతో సినిమాలు చేస్తున్న అఖిల్‌కి ఒక్క సినిమా కూడా కలిసి రావడం లేదు. ఇక ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో నాలుగో సినిమాలో నటిస్తున్నాడు అఖిల్‌. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా పూజా హెగ్దేని ఎంచుకున్న సంగతి తెలిసిందే.

 

ఇప్పుడీ సినిమా సక్సెస్‌, అఖిల్‌ కెరీర్‌ అన్నీ పూజా చేతుల్లోనే ఉన్నాయి. 'బొమ్మరిల్లు' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టినా, ప్రస్తుతం ఫామ్‌లో లేని డైరెక్టర్‌ బొమ్మరిల్లు భాస్కర్‌. ఆయన్ని నమ్మి నాగార్జున, అఖిల్‌ని ఆయన చేతుల్లో పెట్టాడు. కథ బాగుందట. కానీ, కథనం కరెక్ట్‌గా ఉండాలి. అన్నింటికీ మించి అదృష్టం కలిసి రావాలి. ఆ అదృష్టం పూజా రూపంలో అఖిల్‌కి కలిసొస్తుందని భావిస్తున్నారంతా. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. చాలా కాలంగా షూటింగ్‌ జరుగుతున్నా, ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదింతవరకూ. కానీ, త్వరలోనే అఖిల్‌ సినిమాకి దిమ్మ తిరిగే అప్‌డేట్‌ రానుందని ఫిలిం వర్గాల సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS