గాల్లో నిలబడి అందాల భామ పూజా హెగ్డే అంతకన్నా అందంగా బాణం ఎక్కుపెట్టింది. కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిందది. ఏరియల్ యోగాలో భాగంగా పూజా హెగ్దే ఈ తాజా పోజును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సాంతం గాల్లో నిలబడి విల్లులా తన శరీరాన్ని వంచేసిన ఈ పిక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
కామెంట్స్ మీద కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. నీ కాలికింద ధూళినౌతా.. అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటూ భక్తులుగా మారిపోయారు కొందరు అభిమానులు. 'మీ ఇంట్లో ఎవరైనా ధనూరాశి వారుంటే వారికోసమే ఈ పిక్ ప్రత్యేకం' అంటూ పూజాహెగ్డే ఈ పిక్‌ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ముద్దుగుమ్మలు ఈ ఏరియల్ యోగాతో కిర్రాకు పుట్టిస్తున్నారు.
ఇంట్లో సీలింగ్‌కి ఉన్న హుక్‌కి పొడవాటి బట్టను వేలాడదీసి, దాంతో చేసే ఫీట్లే ఈ ఏరియల్ యోగా. స్లిమ్‌గా ఫిట్‌గా శరీరాన్ని మలచుకునేందుకు ఈ ఏరియల్ యోగా బాగా ఉపకరిస్తోందట. అందుకే తాజాగా పూజా హెగ్డే కూడా ఇదిగో ఇలా ట్రై చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్ మహేష్‌తోనూ, ప్రబాస్‌తో రాధాకృష్ణ తెరకెక్కించబోయే సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
ALSO SEE : Pooja Hegde Latest Photoshoot