అందరిదీ ఒక దారైతే.. కథానాయికలది మరో దారి. లాక్ డౌన్, కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. మళ్లీ మామూలు రోజులు ఎప్పుడొస్తాయా, స్నేహితులతో సరదాగా షికార్లు ఎప్పుడు చేద్దామా? థియేటర్లలో ఎప్పుడు వాలిపోదామా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూజా హెగ్డే మాత్రం.. `నేను బికినీ ఎప్పుడు వేసుకుంటానా, బీచ్‌లోకి ఎప్పుడు వెళ్తానా` అంటూ కలలు కంటోంది.
లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే మీరేం చేస్తారు? అని పూజా హెగ్డేని అడిగితే ''కేరళ లోని బెకల్ బీచ్‌కి వెళ్తా. అక్కడ బికినీ వేసుకుని ప్రైవేటుగా ఎంజాయ్ చేస్తా..'' అంటోంది. వెండి తెరపై బికినీ వేసుకుని నటించడానికి పూజా ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. డీజేలో స్విమ్ సూట్‌లో.. హాట్ హాట్‌గా కనిపించి వేడి పుట్టించింది. అయితే ఆ తరవాత ఎప్పుడూ... బికినీ జోలికి పోలేదు. పూజా స్పీడు చూస్తుంటే.. మరోసారి వెండి తెరపైనా బికినీ వేసుకుని సెగలు పుట్టించడం ఖాయంగా అనిపిస్తోంది.