లాక్ డౌన్ సమయంలో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. స్టార్ హీరోలు సైతం గరెట పట్టుకుని వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. చిరంజీవి కూడా అందుకు అతీతం కాదు. అయితే ఆయన వంటా వార్పు.. ఇప్పటిది కాదు. ముఫ్ఫై ఏళ్ల క్రితమే - చిరు గరెట తిప్పారు. అందుకు సాక్ష్యంగా ఓ ఫొటో ట్విట్టర్ లో పంచుకున్నారు చిరు.
కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదంటూ రెండు ఫొటోల్ని షేర్ చేసుకున్నారు చిరు. 1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను.. ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి షేర్ చేశారు. ఈ రెండు ఫొటోల్లోనూ చిరంజీవి, ఆయన భార్య సురేఖ ఒకే రంగు బట్టల్లో, ఒకే స్టైల్లో నిల్చుని ఉన్నారు. మొదటి ఫొటోకు `జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా` అని, రెండో ఫొటోకు `జైల్‌ఫుల్ హాలీడే ఇన్ కరోనా` అని క్యాప్షన్ ఇచ్చారు. `కాలం మారినా.. దేశం మారినా.. తాను.. నేను మాత్రం ఏమీ మారలేదు` అంటూ ట్వీటారు.