బికినీలో జిల్‌ జిల్‌ జిగా జిగా!

By iQlikMovies - April 09, 2018 - 10:56 AM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాలో ఇటీవలే 'జిగేలు రాణి..' అంటూ ఐటమ్‌ సాంగ్‌లో చిందేసిన పూజా హెగ్దే, హాట్‌నెస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిపోయింది. అందాల పోటీలు, మోడలింగ్‌ కెరీర్‌లోన బికినీ సొగసులతో కిర్రాకు పుట్టించిన ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో చేసిన పీరియాడికల్‌ మూవీ 'మొహంజదారో'లోనూ హద్దులు దాటేసింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అందాల ఆరబోత 'డిజె-దువ్వాడ జగన్నాథం' సినిమాతోనే షురూ చేసింది. అప్పటిదాకా రెండు సినిమాల్లో నటించినా, గ్లామర్‌ షో చెయ్యలేదు. ఇప్పుడు హద్దులు దాటేసి, హీటెక్కించేస్తోంది. తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం ఇలా జిగేల్‌మనే సొగసుల్ని బికినీలో ఆరబోసేసింది. బికినీ పూజా హెగ్దేకి కొత్త కాదు కానీ.. ఆమె ఎప్పుడు బికినీలో కన్పించినాసరే, ఆ కిక్కే వేరప్పా!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS