'ఇకపై మల్టీస్టారర్ సినిమాలొస్తాయ్.. ఓ హీరో సినిమా ఈవెంట్‌లో ఇంకో హీరో కనిపిస్తాడు..' అని సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రకటించడం, అదే వేదికపై యంగ్ టైగర్ ఎన్టీర్ వుండడంతో తెలుగు సినీ అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. మాటలు తేలికే, కానీ చేతలు చాలా కష్టం. మల్టీస్టారర్స్ తెలుగులో చాలా అరుదుగానే వస్తుంటాయి.
వెంకటేష్‌తో కలిసి మహేష్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాడు. అది నిఖార్సయిన మల్టీస్టారర్ తెలుగులో ఇటీవలి కాలంలో. ఆ తర్వాత మళ్ళీ మహేష్, అలాంటి మల్టీస్టారర్ గురించి ఆలోచించలేదు. అయితే, తాజాగా టాలీవుడ్‌లో విన్పిస్తోన్న గాసిప్స్ ప్రకారం చూస్తే అతి త్వరలోనే మహేష్‌ని ఓ మల్టీస్టారర్‌లో చూసే అవకాశం వుందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆల్రెడీ రామ్‌చరణ్‌తో రాజమౌళి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌కి కమిట్ అయిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. అది కూడా మల్టీస్టారరేనట.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఓ కథ విన్నాడనీ, అది మల్టీస్టారర్ కథాంశమనీ, అందులో మరో హీరో ఇంకెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ అనీ తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేయబోయేది వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే. ఆ తర్వాతే వంశీ - ఎన్టీఆర్ - మహేష్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కుతుందని సమాచారమ్.