టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొంది పూజా హెగ్డే. పెద్ద హీరోల సినిమాలకు తానే కేరాఫ్ అడ్రస్స్. ఒక్కో సినిమాకి దాదాపు రూ.3 కోట్ల పారితోషికం అందుకొంటోంది. పారితోషికంతో సరిపెట్టడం లేదు. సెట్లో తనకు సకల సౌకర్యాలూ ఇవ్వాల్సిందే.
సెవన్ స్టార్ వసతి, చుట్టూ మందీ మార్బలం... ఇవన్నీ కల్పించాల్సిందే. హోటెల్ నుంచి సెట్‌కీ, సెట్ నుంచీ హోటెల్‌కీ కారు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఇవ్వడానికి నిర్మాతలూ రెడీగానే ఉన్నారు. తాజాగా మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది పూజా. ఈ సినిమా కోసం, పూజా హెడ్గేకు ప్రత్యేకంగా రూ.2 కోట్ల ఖరీదు చేసే కారు కొన్నారట. ఈ కారు కేవలం పూజాకి మాత్రమే ప్రత్యేకం. ఈ సినిమా చేసినన్ని రోజులూ.. పూజా ఈ కారు వాడుకొంటుందట. హీరోయిన్లకు కంపెనీ కార్లు ఏర్పాటు చేయడం సహజమే. కాకపోతే.. కేవలం పూజా కోసం ప్రత్యేకంగా కొత్తకారు కొనాల్సిరావడం ఏమిటా? అంటూ ఇండస్ట్రీలో జనాలు గుసగుసలాడుకొంటున్నారు. త్రివిక్రమ్ చొరవతోనే పూజాకు రూ.2 కోట్ల కారు కొన్నారని, ఇది ఈ సినిమా కోసమే కాదని, ఏకంగా పూజాకి ఈ కారు గిఫ్టుగా ఇచ్చేశారని వార్తలు కూడా వినవస్తున్నాయి. మరి.. దీనిపై చిత్రబృందం ఏమంటుందో?