బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా చెలామణీ అవుతోన్న ప్రదీప్ మాచిరాజు ఈ మధ్యనే హీరోగా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కాలం కలిసొస్తే, మనోడు హీరోగా యాప్టా.? కాదా.? అనేది ఈ పాటికే తెలిసిపోయి ఉండేది. కానీ, కలికాలం కాస్తా కరోనా కాలంగా మారిపోయింది. కనీ వినీ ఎరుగని విధంగా 21 రోజుల పాటు సినిమా షూటింగ్‌లూ, సినిమా ధియేటర్స్ బంద్ అయిపోయాయి. దాంతో ఉగాదికి గ్రాండ్‌గా రిలీజ్ అవ్వాల్సిన ప్రదీప్ డెబ్యూ మూవీ ఆగిపోయింది. సినిమా ఆగిపోతే అగిపోయిందిలే కానీ, కరోనా కాటు మన ఇండియాపై ముఖ్యంగా టాలీవుడ్‌పై పడక ముందే, ప్రదీప్ డెబ్యూ మూవీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నుండి రెండు ఆడియో సింగిల్స్ రిలీజ్ చేసేశారు.
రెండు పాటలూ సూపర్ హిట్స్ అయ్యాయి. వాటిలో ‘నీలి నీలి ఆకాశం..’ సాంగ్ అయితే, ప్రేక్షకుల్ని ముఖ్యంగా యూత్‌ని ఉర్రూతలూగించింది. ఇంతేనా.? యూ ట్యూబ్‌లో ఈ సాంగ్ రికార్డు సృష్టించింది. లేటెస్ట్గా యూ ట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డుకెక్కిన ఆడియోగా బన్నీ ‘అల వైకుంఠపురములో..’ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాన్ని ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’లోని ‘నీలి నీలి ఆకాశం..’ సాంగ్ కొట్టేయడం విశేషం. చంద్రబోస్ రచనలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌ని సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. యూ ట్యూబ్‌లో ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించడంతో, సినిమా రిలీజ్ కాకముందే ఓ సరికొత్త రికార్డు ప్రదీప్ సొంతమైంది.