పూజా హేగ్డేకి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌.

మరిన్ని వార్తలు

వరుస‌గా మంచి అవ‌కాశాల్ని అందుకుంటోంది పూజా హెగ్డే. ఇప్పుడు మ‌రో గోల్డెన్ ఛాన్స్ త‌న ఖాతాలో వేసుకుంది. హ‌ను రాఘ‌వ‌పూడితో వైజ‌యంతీ మూవీస్ ఓ సినిమా చేయ‌బోతోంది. దుల్క‌ర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడు. క‌థానాయిక‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. పూజాతో వైజ‌యంతీ అగ్రిమెంట్లు కుదిరిపోయాయ‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తోంద‌ని స‌మాచారం.

 

స్క్రిప్టు ఇప్ప‌టికే పూర్త‌యింది. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్తుంది. `మ‌హాన‌టి`లో ఓ కీల‌క పాత్ర పోషించాడు దుల్క‌ర్‌. అప్పుడే దుల్క‌ర్‌తో వైజ‌యంతీ మూవీస్ ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ సినిమానే ప‌ట్టాలెక్కిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి చేస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS