పూజా హెగ్దే ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లోని జార్జియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్‌లో ప్రబాస్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ప్రబాస్ యూరప్‌కి బయల్దేరిన సంగతి తెలిసిందే. తాజాగా పూజా హెగ్దే కూడా యూరప్‌కి బయల్దేరింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచమంతా భయం గుప్పిట్లో వణుకుతున్న నేపథ్యంలో చాలా వరకూ సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.
విదేశాల్లో జరుగుతున్న కొన్ని షూటింగ్స్ అయితే, మధ్యలోనే వదిలేసి వచ్చేస్తున్నారు. అలాంటిది ప్రబాస్, పూజా హెగ్దే నటిస్తున్న ఈ తాజా సినిమా మాత్రం షూటింగ్ నిరాటంకంగా జరుపుకోవడం పట్ల అందరూ ఆశ్యర్యపోతున్నారు. తాను జార్జియాకు బయల్దేరుతున్న విషయాన్ని స్వయంగా పూజా హెగ్దేనే ట్విట్టర్ ద్వారా తెలిపింది. కరోనా కారణంగా మాస్క్ ధరించిన ఫోటో పోస్ట్ చేసింది. మొత్తానికి ప్రబాస్ అండ్ టీమ్ ఉత్సాహం చూస్తుంటే, ఏది ఏమైనా ఈ సినిమాని అతి త్వరలో పూర్తి చేసేలానే కనిపిస్తున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.