వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి అంటే తెలియని వాళ్లు లేరు. తమిళ నటుడైనా, ప్రస్తుతం ఈయన ఇటు టాలీవుడ్‌నీ, బాలీవుడ్‌నీ కూడా చక్కబెట్టేస్తున్నాడు. మాతృభాషలో హీరోగా, ఇతర భాషల్లో విలన్‌గానూ, ఇంపార్టెంట్ రోల్స్‌తోనూ అలరిస్తున్నారు. ఇకపోతే, ఆన్ స్క్రీన్ డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్న ఈ నటుడు, ఆఫ్ స్క్రీన్‌లోనూ హీరో అనిపించుకుంటున్నాడు. తనతో కలిసి పని చేసిన నటుడు లోకేష్‌కి ఈ మధ్య అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. గుండెపోటు, పక్షవాతంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్ గురించి సమాచారం అందుకున్న విజయ్ సేతుపతి, తన బిజీ షెడ్యూల్స్‌ని వాయిదా వేసుకుని లోకేష్ ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు.
ఆయనకు మంచి వైద్య చికిత్సను అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరుతూ, అందుకు తగిన ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మన టాలీవుడ్ హీరోలు కూడా గతంలో ఇలా పలువురు కోస్టార్స్, అభిమానుల బాగోగులు చూడడంలో పెద్ద మనసు చాటుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ లిస్టులోనే ఈ తమిళ హీరో కూడా జాయిన్ అయిపోయాడన్న మాట. ఇకపోతే, విజయ్ సేతుపతి ప్రస్తుతం తెలుగులో రెండు ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటిస్తున్నాడు. మెగా మేన్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ చేస్తున్న ‘ఉప్పెన’ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.