ఇంతవరకూ చేసిన సినిమాలన్నీ తీసుకుంటే, పూజా హెగ్దేకి ఎక్కడా మైనస్ పాయింట్స్ పడలేదు. ఆమె అప్పియరెన్స్ దగ్గర నుండీ, పర్ఫామెన్స్ వరకూ అంతా మెచ్చుకున్నవాళ్లే. అయితే, ఇది ఆన్ స్క్రీన్ స్టోరీ. ఆఫ్ స్క్రీన్ పూజా ఎలా ఉండబోతోంది.? అంటే అల్లు అర్జున్ ఒక్క మాటలో చెప్పేశాడంతే, చాలా ప్రొఫిషనల్‌గా ఉంటుందట. 'టూ స్మార్ట్' అని బిరుదిచ్చేశాడు. ఏం చెప్పినా ఇట్టే అర్ధం చేసుకుంటుందట. ఏదో నటించేశాములే పడుంటుంది అన్నట్లుగా కాకుండా, తాను చేసే సీన్లోని ఎమోషన్‌నీ, ఫీల్‌నీ డీప్‌గా స్టడీ చేసి అర్ధం చేసుకుని నటిస్తుందట. అందుకే స్క్రీన్‌పై ఆమె ప్రెజెన్స్ ఆ లెవల్లో ఉంటుంది.
Also Read రజనీ పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు
ఇకపోతే, 'అల వైకుంఠపురములో..' సినిమా విషయానికి వస్తే, ఓ కార్పొరేట్ కంపెనీ హెడ్‌గా పూజా కనిపించనుందట. అందుకే ట్రైలర్లో బన్నీ పూజానుద్దేశించి అంత పెద్ద బిస్కెట్ వేశాడు. పుట్టించే హక్కు ఇద్దరికే ఉంది. ఒకటి నేలకీ, రెండు వీళ్లకే.. వాళ్లతో గొడవలెందుకు బాబాయ్.. సరెండర్ అయిపోవాల్సిందే.. అంటూ అద్బుతమైన డైలాగ్ చెప్పి మెప్పించేశాడు. ఇక సాంగ్స్‌లో పూజా హెగ్దే కేక పుట్టిస్తోంది. ముఖ్యంగా 'బుట్టబొమ్మ..' సాంగ్‌లో అయితే, ఆమెకు సాటి ఎవరూ లేరనే అనిపిస్తోంది. బన్నీతో పూజా హెగ్దే రెండో సారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ఇది. తొలి సినిమా 'డీజె' ఫెయిలైనా, పూజా హెగ్దే పేరు మాత్రం మార్మోగిపోయింది. ఇప్పుడు కూడా బన్నీ పక్కన పూజా పేరు అలాగే మార్మోగిపోతోంది. చూడాలి మరి ఈ కాంబోలో సెకండ్ టైమ్ రూపొందుతోన్న 'అల..' పూజా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని ఆశిద్దాం.