పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన `గబ్బర్ సింగ్` ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా రాబోతోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. లాక్ డౌన్ సమయంలోనే.. పవన్ కోసం కథని రెడీ చేసేశాడు హరీష్. ఇప్పుడు పట్టాలెక్కించడమే ఆలస్యం. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని టాక్. ఈలోగా పవన్ `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ పూర్తి చేసేస్తాడట.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. దేవి - హరీష్... ఇద్దరూ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా ఉన్నారు కూడా. మరోవైపు కథానాయిక ఎంపిక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హరీష్ ఈమధ్య పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నాడు. `డీజే`, `గద్దలకొండ గణేష్` చిత్రాలలో పూజానే నాయిక. ఆ సెంటిమెంట్ తో పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫిక్స్ చేసేశాడని టాక్. పైగా పవన్ - పూజాల కాంబినేషన్ కూడా కొత్తగానే ఉంటుంది. సో... దాదాపుగా పూజా ఖరారైపోయినట్టే.