భద్రతో దర్శకుడిగా తన ప్రయాణం ఆరంభించాడు బోయపాటి శ్రీను. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సింహాతో కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు బోయపాటి. `సరైనోడు` లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ బోయపాటి ఖాతాలో ఉంది. అయితే... `భద్ర` తరవాత.. రవితేజతో కలసి పనిచేయలేదు. ఇన్నాళ్లకుల ఈ కాంబో మళ్లీ వర్కవుట్ అయ్యేట్టు కనిపిస్తోంది. రవితేజ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని టాలీవుడ్ సమాచారం.
రవితేజ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం `ఖిలాడీ`తో బిజీగా ఉన్నాడు రవితేజ. ఇటీవల బోయపాటి - రవితేజల మధ్య భేటీ జరిగిందని, ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలన్న నిర్ణయానికి వచ్చారని టాక్. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `మోనార్క్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా తరవాత రవితేజతో సినిమా ఉండొచ్చన్నది టాక్. నిర్మాత, ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయి.