ప్రభాస్ - పూజా హెగ్డే కలిసి జంటగా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దానికి తోడు.. సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌కీ, పూజా కీ అస్సలు పడలేదని, ఇద్దరూ ఎడమొహం, పెడమొహంలా ఉన్నారని.. ఇద్దరి మధ్యా మటలే లేవని గుసగుసలు వినిపించాయి. అయితే.. దీనిపై ఎవ్వరూ స్పందించలేదు. ఇక ప్రభాస్ సినిమాలో పూజా నటించడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే వీళ్లు మళ్లీ జత కట్టబోతున్నారని టాలీవుడ్ టాక్.
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీనికి `డీలక్స్ రాజా` అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని టాక్. ఆ ముగ్గరు కథానాయికలు ఎవరన్నది ఇప్పటి వరకూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇందులో ఓ కథానాయికగా పూజాని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం ఇప్పటికే పూజాతో సంప్రదింపులు జరుపుతోందని, పూజా కూడా దాదాపుగా ఓకే చెప్పేసిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమా లో నటించడానికి పూజా ఒప్పుకుంటే.. రాధే శ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్ తో తనకు గొడవలేం లేనట్టే అనుకోవాలి. మరి..పూజా ఎంట్రీ ఖాయమా, కాదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం హారర్ కామెడీ నేపథ్యంలో సాగుతుందని టాక్.