`ఆర్.ఆర్.ఆర్` మరోసారి దుమ్ము దులిపింది. ఉగాది పండగ సెలవుని... బాగా క్యాష్ చేసుకొంది. శనివారం ఉగాది సందర్భంగా.. ఆర్.ఆర్.ఆర్ థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఉగాది రోజే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిసి దాదాపుగా రూ.20 కోట్లు వసూలు చేసిందని టాక్.
సినిమా విడుదలైన 9వ రోజు.... 20 కోట్లు రావడం అంటే మాటలు కాదు. ఉగాది పండగ.. ఫ్యామిలీ అంతా కలిసి బయటకు రావడం వల్ల, ఎక్కడ చూసినా, కుటుంబ ప్రేక్షకులే కనిపించారు. 3డీ స్క్రీన్లు పెంచడం కూడా.. ఆర్.ఆర్,ఆర్‌కి కలిసొచ్చింది. 2డీలో సినిమా చూసినవాళ్లు, త్రీడీలో ఓసారి చూద్దాం.. అనుకుని ధియేటర్లకు వచ్చారు.
ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య పెరగడం కూడా భారీ వసూళ్లకు ఓ కారణం. ఆదివారం కూడా ఇంచుమించుగా రూ.13 కోట్ల వరకూ వచ్చిందని టాక్. తొలి పది రోజుల్లో రెండు తెలుగు రాష్ఠ్రాల్లో కలిపి దాదాపుగా రూ.220 కోట్లు సాధించింది. మరో వారం రోజుల్లో రూ.250 కోట్ల మైలు రాయి అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు లెక్క గడుతున్నారు.