ఒక్కో దర్శకుడికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది దర్శకులు తమ హీరోయిల్ని రిపీట్ చేస్తుంటారు. త్రివిక్రమ్ కొన్నాళ్లు సమంతని ఇలానే రిపీట్ మోడ్‌లో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పుడు పూజా హెగ్డేని ఎంచుకుంటున్నాడు. ఇదే బాటలో నడుస్తున్నాడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ కోసం ఓ కథ తయారు చేస్తున్నాడు.
మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేని అనుకుంటున్నార్ట. హరీష్ తెరకెక్కించిన డీజేలో పూజా కథానాయిక. ఆ తరవాత గద్దల కొండ గణేష్‌లోనూ తననే తీసుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా పూజానే రిపీట్ చేయబోతున్నాడని టాక్. పైగా పవన్ - పూజాలు ఫ్రెష్ కాంబినేషన్ కదా. అందుకే.. మరోసారి పూజాకే ఓటేయబోతున్నాడట హరీష్.