రామ్ చ‌ర‌ణ్‌తో పూజా హెగ్డే

మరిన్ని వార్తలు

పూజా హెగ్డే ఫామ్ మామూలుగా లేదు. వ‌రుస‌గా పెద్ద పెద్ద సినిమాల ఆఫ‌ర్లు అందుకుంటోంది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న న‌టించే ఛాన్సు కొట్టేసింది. చిరంజీవి - కొర‌టాల శివ కాంబోలో `ఆచార్య‌` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ క‌థానాయిక‌. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ప‌క్క‌న ఓ క‌థానాయిక ఉంటుంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌ష్మిక మండ‌న్నా న‌టిస్తుంద‌ని చెప్పుకున్నారు. అయితే అనూహ్యంగా ఆ ప్లేసులోకి పూజా వ‌చ్చి చేరింది. ర‌ష్మిక డేట్లు స‌ర్దుకాక‌పోవ‌డంతో.. పూజాతో చిత్ర‌బృందం ఎడ్జిస్ట్ అయిన‌ట్టు టాక్‌. ఆచార్య సెట్లోకి చ‌ర‌ణ్ ఇటీవ‌లే అడుగుపెట్టాడు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఎపిసోడ్లు తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే.. చిరంజీవి - చ‌ర‌ణ్‌ల‌పై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు. ఆ త‌ర‌వాత‌.. పూజా ఎంట్రీ ఇస్తుంది. చ‌ర‌ణ్ - పూజాల‌పై ఓ పాట కూడా తెర‌కెక్కిస్తార్ట‌. మేలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జ‌న‌వ‌రి 26న టీజ‌ర్ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS