ముద్దుగుమ్మ పూజాహెగ్దే ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో అమ్మడు చేతిలో ప్రస్తుతం ఉన్నవన్నీ ఎన్టీఆర్, మహేష్, ప్రబాస్ ఇలా స్టార్ హీరోల సినిమాలే. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం. ఈ స్థాయిలో డిమాండ్ ఉంది కాబట్టే. అమ్మడు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటోంది కూడా. ఇదిలా ఉంటే, పూజా హెగ్దేకు హాట్ హాట్ ఫోటో సెషన్స్ అంటే మక్కువ ఎక్కువ. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, చిన్న ఖాళీ దొరికినా ఫోటో సెషన్స్‌కీ టైం కేటాయిస్తుంటుంది. అందులో భాగంగానే దిగిన లేటెస్టు ఫోటో స్టిల్ ఇది. మెరూన్ టాప్, వైట్ బోటమ్‌లో పూజా స్టిల్ అదిరిపోతోంది. గ్లామర్‌కి గ్లామర్, స్టైల్‌కి స్టైల్ కిర్రాకు పుట్టిస్తోందంతే. ఈ శుక్రవారం 'సాక్ష్యం' సినిమాతో పూజా హెగ్దే ప్రేక్షకుల ముందుకు రానుంది.