బిగ్‌బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన వారంతా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని బయటికి వచ్చినవారే. హౌస్ మొత్తానికి తల్లిగా అభివర్ణించబడిన శ్యామల తప్ప. నిజానికి శ్యామల తక్కువ ఓట్ల కారణంగా ఎలిమినేట్ అయ్యింది కాదు. పర్సనల్ రీజన్ కారణంగా కావాలనే హౌస్ నుండి బయటికి వచ్చింది. తన కొడుకు మొదటి బర్త్‌డేకి హాజరయ్యేందుకే శ్యామలను హౌస్ నుండి తాత్కాలికంగా బయటికి పంపించారు. ఇదే విషయాన్ని శ్యామల కూడా ప్రస్థావించింది.
ఇకపోతే వైల్డ్ కార్ట్ ఎంట్రీలో మిగిలిన వారి కన్నా శ్యామలకు ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయి. శ్యామల కూడా హౌస్‌లోకి వెళ్లేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. శ్యామల హౌస్‌లోకి వెళ్లాలంటే తనకు అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రేక్షకులపైనే ఉంది. అలా అని మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తక్కువేమీ కాదు.
'బిగ్‌బాస్' స్టార్ట్ అయిన తొలి వారంలోనే సంజన ఎలిమినేట్ అయిపోయింది. అలాగే నూతన్ నాయుడు, కిరీటీలు కూడా మరికొంత కాలం హౌస్‌లో కొనసాగి ఉంటే బావుండేదని కొంతమంది ప్రేక్షకులు భావిస్తున్నారు. భానుశ్రీ, తేజుకి కూడా బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే ముఖ్యంగా గమనించాల్సిన అంశమేంటంటే, శ్యామల హౌస్ నుండి బయటికి వచ్చాక హౌస్‌లో ఈక్వేషన్స్ మారిపోయాయి. ఆ తర్వాతే గొడవలకు వేదికైపోయింది బిగ్‌హౌస్.
సో బిగ్‌బాస్ హోస్ట్ నాని 'పిన్నిగారూ.!' అని ముద్దుగా సంబోధించే శ్యామల పిన్నిగారి రీ ఎంట్రీ బిగ్ హౌస్‌లో ఉంటుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.