గ్లామ్‌షాట్‌: అందాల గోపికా.. గ్లామర్‌ మేనకా!

మరిన్ని వార్తలు

మొన్న హాట్‌ హాట్‌ అందాల ప్రదర్శన. ఇప్పుడు ట్రెడిషనల్‌ వేర్‌లో సాంప్రదాయ అందాల ప్రదర్శన. ఎలా ప్రదర్శించినా చక్కనమ్మలకు ఆ అందమే కదా అతి పెద్ద ఆయుధం. ఆ అందాలకు ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. ఇంకెన్నో హృదయాలు కాలిపోయాయి. మరెన్నో కోటలు బద్దలైపోయాయ్‌. ఎంతని చెప్పేది. ఏమని చెప్పేది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అందాల భామ పూజా హెగ్దే.

 

పూజా ఇప్పుడు సౌత్‌నీ, నార్త్‌నీ కూడా యువరాణిలా ఏలేస్తోంది. బాలీవుడ్‌లో బిగ్‌ అండ్‌ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్ట్‌ 'హౌస్‌ఫుల్‌ 4' త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పూజా హెగ్దేనే సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతోంది. ఈ సినిమాలో పూజాతో పాటు, మరో ఇద్దరు ముద్దుగుమ్మలున్నా, వారితో పోల్చితే, అన్ని రకాలుగా పూజా హెగ్దే యాక్టివ్‌గా కనిపిస్తోంది. ఓ రేంజ్‌లో అందాలారబోస్తూ, కనువిందు చేస్తోంది.

 

ఇక తాజా పిక్‌ విషయానికొస్తే, ఎల్లో కలర్‌ చోళీలో హాట్‌ హాట్‌గా బెల్లీ ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ కెమెరాకి పోజిచ్చింది. అమాయకంగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి, తనకేం తెలీదన్నట్లు, సింపుల్‌గా కుర్రకారు మతులు పోగొడుతోంది. చెవులకు ధరించిన లాంగ్‌ జుంకీ సెట్‌ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం పూజా 'అల వైకుంఠపురములో' సినిమాతో పాటు, ప్రబాస్‌తో 'జాన్‌' సినిమాలోనూ, అఖిల్‌ సినిమాలోనూ నటిస్తోంది తెలుగులో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS