'ఆమె'లా మారనంటోన్న కంగనా.!

By Inkmantra - October 23, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

అమలాపాల్‌ నటించిన 'ఆడై' చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతో విడుదలై సంచనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. సక్సెస్‌ పరంగా సంచలనం సంగతెలా ఉన్నా, ఈ సినిమాలో ఓ సీన్‌ కోసం అమలాపాల్‌ పూర్తి నగ్నంగా నటించింది. ఈ విషయమే వివాదాంశమైంది. ఈ సినిమాని హిందీలో కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కించనున్నారన్న గాసిప్‌ చక్కర్లు కొట్టింది. అయితే, ఇది ఉత్త గాసిప్‌ మాత్రమే అని తాజాగా కంగనా టీమ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

 

అంటే కంగనా ఈ పాత్ర పోషించడం లేదని తేలిపోయింది. అయితే, ఈ గాసిప్‌ పుట్టగానే, అందరూ ఈ సినిమాకి కంగనా అయితే చాలా బాగుంటుందనీ, తనదైన నటనతో కంగనా సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళుతుందని అనుకున్నారు. ఈ తరహా బోల్డ్‌ పాత్రలకు కంగనా ఆటిట్యూడ్‌ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఖచ్చితంగా ఆమె కెరీర్‌లో ఇదో మంచి సినిమా అవుతుంది.. అని సోషల్‌ మీడియాలో పోజిటివ్‌ ఒపీనియన్స్‌ వచ్చాయి.

 

కానీ, తాజా సమాచారంతో కంగనాని ఆ పాత్రలో చూడలేమని తేలిపోయింది. కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ 'తలైవి'లో మాత్రమే నటిస్తోందనీ ఈ టీమ్‌ ద్వారా తెలుసింది. అయితే, ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత మహేష్‌ భట్‌ దక్కించుకున్నారట. ఒరిజినల్‌ డైరెక్టర్‌ రత్న కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS