'జిల్ జిల్ జిగేల్ రాజా..' అంటూ 'రంగస్థలం' సినిమాలో చరణ్ సరసన మాస్ స్టెప్పులిరగదీసిన పూజా హెగ్దే తాజాగా ఇన్‌స్టాలో ఓ పిక్ పోస్ట్ చేసిందండీ. ఈ పిక్‌కీ, పిక్‌లో పూజా ఎక్స్‌ప్రెషన్‌కీ 100కి 110 మార్కులు తక్కువే అనాలేమో. అంత కైపెక్కించేలా ఉన్నాయి పూజా ఎక్స్‌ప్రెషన్స్. మేఘాల రంగు చోలీలో నిండుగా ఆభరణాలు ధరించింది. డీప్ కట్ నెక్‌లో జీరో సైజ్ పరువాల్ని ఆవగా ఆరేసింది. మెడలో ధరించిన భారీ నెక్లెస్, చెవులకు గుండ్రని పెద్ద చెవి దుద్దులు ఆమె ముఖానికి చాలా అందాన్ని తీసుకొచ్చాయి. హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్‌గానే ఉంది. 'శరవణన్' గాజుల మేళాలా ఒక చేతికి నిండుగా గాజులు ధరించింది. ఉంగరాలు కూడా ఉన్నాయి. ఇంకో చేతిని ఊరికే అలా వదిలేసింది. డ్రస్‌కి మ్యాచింగ్ ఐ షేడ్స్ వేసింది.
కొద్దిగా ముందుకు వంగి ఎద పరువాల్ని వదులుగా వదిలేసి, ఫేస్‌లో ఇచ్చిన సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌కి కుర్రకారుకు పాపం పగలూ రాత్రీ తేడా లేకుండా పోతోందంటే నమ్మి తీరాల్సిందే. ఈ పిక్‌పై లుక్కేసి, ఓ లైక్ కామెంట్ వేసుకోని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఏంటిదంతా సక్సెస్ తెచ్చిన గ్లామరే అనుకోవాలేమో. ఈ మధ్య బాలీవుడ్‌లో 'హౌస్‌ఫుల్ 4' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. 'గద్దలకొండ గణేష్'తో టాలీవుడ్‌లోనూ ఇరగదీసింది. ఇప్పుడిక 'రాములో రాములా..' అంటూ పాపం అల్లు అర్జున్‌ని ఆగమాగం చేసింది.