'ఆర్ ఎక్స్ 100' సినిమాలో చేసిన అందాల రచ్చకు ఏడాదంతా అమ్మడి జపమే చేసుకున్నారంతా. అంత సులువుగా మర్చిపోలేని అందాల దాడి అది. అర్ధమైపోయుంటుంది కదా.. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. హా.. ఎగ్జాట్లీ.. ఆ హాట్ బ్యూటీనే పాయల్ రాజ్‌పుత్. ఈ భామ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఒకటి 'డిస్కోరాజా' కాగా, ఇంకోటి 'వెంకీ మామ'. 'డిస్కోరాజా'లో పాప గ్లామర్ విశ్వరూపం ఇంకా తెలీదు కానీ, లేటెస్ట్‌గా 'వెంకీ మామ' నుండి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో ఒంటి కొమ్ము సొంటి కొమ్ము సెంటు పట్టెరో..' అంటూ సాగే ఈ పాటను 1980 కాలం నాటి రోజుల్ని గుర్తు చేసేలా తెరకెక్కించారు.
హీరో, హీరోయిన్స్ మేకప్ చిత్రీకరణ ఆ కాలం నాటి హీరో, హీరోయిన్స్‌ని తలపించేలా ఉంది. నాటి కాలమైనా కానీ, పాయల్ రాజ్‌పుత్ మాత్రం హాట్ టచ్ మిస్ చేయలేదు. పొట్టి పొట్టి దుస్తుల్లో కిర్రాక్ పుట్టించేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నాటి కాస్ట్యూమ్స్‌లో వెంకీ తనదైన శైలి చూపించాడు. మొత్తానికి ఈ పాటకి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ పాటను స్టార్ట్ చేయడానికి ముందు 'ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితమే గుచ్చుకుని ఉంటే బాగుండేది కదా..' అంటూ కలల్లోకి వెళ్లినట్లుగా చూపించి, కట్ చేస్తే వెంకీ - పాయల్ మధ్య ఈ సాంగ్ ప్లే చేశారన్న మాట. డిశంబర్‌లో 'వెంకీ మామ' ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ, పాయల్ జంట ఎలా ఉండబోతుందో చూసేశాం. ఇక చైతూ - రాశీఖన్నా జంట మిగిలుంది. త్వరలోనే ఈ జంట పైనా ఓ వీడియో క్లిప్ రిలీజ్ కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత.