ఇక్కడే కాదు, అక్కడ కూడా జిగేల్‌రాణి హవానే!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా కెరీర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగానే జిగేల్‌ రాణి అంటూ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన 'రంగస్థలం' సినిమాలో మాస్‌ స్టెప్పులిరగదీసింది. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడమే కాదు, ఆ సాంగ్‌తో పూజా హెగ్దే ఊపు ఊపేసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పూజా హెగ్దే పేరు మార్మోగిపోతోంది. ఇటీవలే 'గద్దలకొండ గణేష్‌'లో శ్రీదేవి పాత్రలో కనిపించింది. కనిపించింది కొద్దిసేపే అయినా, గత్తర లేపేసింది.

 

ఇక 'ఎల్లువొచ్చి గోదారమ్మ..' సాంగ్‌లో పూజా పర్‌ఫామెన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ కెవ్వుకేక. ప్రస్తుతం పూజా చేతిలో రెండు స్టార్‌ ప్రాజెక్టులున్నాయి. అవే అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో', ప్రబాస్‌తో 'జాన్‌' సినిమాలు. ఈ రెండు సినిమాల్లోనూ పూజా పాత్రకు స్కోప్‌ ఎక్కువే ఉండబోతోందట. అలాగే అక్కినేని హీరో అఖిల్‌ ఫేట్‌ని మార్చే బాధ్యత కూడా ఇప్పుడు పూజాహెగ్దేపైనే ఉండడం విశేషం. అఖిల్‌కి జోడీగా పూజా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లోనూ పూజా హెగ్దే సత్తా చాటుతోంది. 'హౌస్‌ఫుల్‌ 4' సినిమాలో పూజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఫోటోల్లో పూజా పాత్రను మహారాణి మాలాగా నటించబోతోంది.

 

అంతేకాదు, ఈ సినిమాలో పూజాది డబుల్‌ రోల్‌. ఇంకో పాత్రలో పూజాగా కనిపించనుంది. 'హౌస్‌ఫుల్‌' సిరీస్‌లో వచ్చిన అన్ని సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆ సిరీస్‌లో నాలుగో చిత్రంగా వస్తున్న ఈ సినిమాపైనా భారీగా అంచనాలున్నాయి. అంటే, బాలీవుడ్‌ నుండి కూడా పూజా ఖాతాలో ఓ సూపర్‌ హిట్‌కి స్లాట్‌ బుక్కయిపోయిందనుకోవాలి. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్‌, కృతి కర్బంధ, కృతి సనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS