తెలుగులో సూర్య సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..?

By Gowthami - September 26, 2019 - 13:45 PM IST

మరిన్ని వార్తలు

గ‌జిని సినిమాతో తెలుగులోనూ సూర్య‌కి మార్కెట్ మొద‌లైంది. త‌మిళంలో సూర్య చేసిన ప్ర‌తి సినిమా... తెలుగులోనూ విడుద‌లైంది. ఓ ద‌శ‌లో తెలుగులో మాస్ హీరోల‌తో సమానంగా ఓపెనింగ్స్ ద‌క్కేవి. అందుకే తెలుగులో సూర్య‌తో నేరుగా ఓ సినిమా చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నించారు. వినాయ‌క్, సూర్య లాంటి స్టార్ ద‌ర్శ‌కులు క‌థ‌లు కూడా చెప్పారు.

 

కానీ ఏదీ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు సూర్య తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. ఈ చిత్రానికి బీవీఎస్ ర‌వి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తార‌ని స‌మాచారం. ఇటీవ‌లే బీవీఎస్ ర‌వి సూర్య‌కు క‌థ చెప్పార‌ని, అది సూర్య‌కు కూడా న‌చ్చింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివ‌రాల్నీ అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS