టాలీవుడ్ లోనే కాదు, సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ కథానాయిక గా నిలిచింది పూజా హెగ్డే. తను పట్టిందల్లా బంగారమే. అందుకే పూజాకి అంత డిమాండ్. `రాధేశ్యామ్`లో తను కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే తొలిసారి. అందుకే వెండి తెరపై ఈ జంట ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇది ప్రేమ కథ కాబట్టి, ఆన్ స్క్రీన్ పై వీళ్లద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ కుదరడం చాలా అవసరం.
వెండి తెరపై రొమాన్స్ చేయాల్సిన ఈ జంట... సెట్లో గొడవ పడ్డారని, పూజా ప్రవర్తన ప్రభాస్ కి ఏమాత్రం నచ్చలేదని, అందుకే ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. పూజా సెట్ కి సరిగా వచ్చేది కాదని, సెట్లో ప్రభాస్ తో చాలా దూరంగా ఉండేదని, వీరిద్దరిపై తెరకెక్కించాల్సిన ఓ రొమాంటిక్ గీతాన్ని... గ్రాఫిక్స్వాడి తీసేశారని చెప్పుకున్నారు. రాధే శ్యామ్ ప్రమోషన్లకు కూడా పూజా రావడట్లేదని టాక్ నడిచింది. అయితే... రాధేశ్యామ్ ప్రమోషన్లు ఇప్పుడు ఊపందుకున్నాయి. పూజా కూడా ఈ ప్రమోషన్లలో పాలు పంచుకుంటోంది. ముంబై, చెన్నైలలో జరిగిన ఈవెంట్లలో పూజా కనిపించింది. హుషారుగా మాట్లాడింది. దాన్ని బట్టి ప్రభాస్ - పూజాల మధ్య గొడవ సమసిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈవారంలోనే హైదరాబాద్లో కూడా ప్రమోషన్ ఈవెంట్స్ మొదలవుతాయి. ఇక్కడా.. పూజాని చూడొచ్చు. సో.. రాధేశ్యామ్ గొడవ తీరిపోయినట్టే అనుకోవాలిక.